పాల్వంచ, జూలై 14 : పాల్వంచ మార్కెట్లో కూరగాయలు అమ్ముకునే పుల్లయ్య, పార్వతమ్మ దంపతుల మనవడు శివ(17) కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. రెండు కిడ్నీలు చెడిపోవడంతో చికిత్స చేయించేందుకు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు. విషయం తెలిసిన వర్తక సంఘం కన్వీనర్ చాలవాది ప్రకాశ్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి సోమవారం రూ.17,500 ఆర్థిక సాయం అందజేశారు.