రుద్రంపూర్, ఏప్రిల్ 18 : సింగరేణి కొత్తగూడెం ఏరియాలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్‌గా విధులు నిర్వహిస్తున్న మంద ప్రేమ్ కుమార్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాలపాలయ్యాడు. తక్కువ జీతంతోనే కుటుంబాన్ని పోషిస్తున్న ఆయనకు ప్రమాదం కారణంగా అదనపు ఆర్థిక భారాలు ఏర్పడ్డాయి.
ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న తోటి ఉద్యోగులు మానవత్వాన్ని చాటుతూ తమ వంతు సహాయంగా రూ.5,600ను సేకరించి చంద్రకొండ మండలం దామరచర్లలో ప్రేమ్ కుమార్ ఇంటికి వెళ్లి ఆయన యోగ క్షేమాలను అడిగి తెలుసుకుని నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇల్ల ప్రసాద్, చిలక నాగేష్, నాగవేణు నూకరాజు, విజయరాజు, విరస్వామి అరుణ్, సాయితేజ, సూర్యం, నరేంద్ర, చైతన్య పాల్గొన్నారు.