‘రైతులు అపరాల సాగు చేపట్టాలి’
దమ్మపేట మండలంలోని దమ్మపేట రైతు వేదిక నందు వ్యవసాయ శాఖ అధికారులు మంగళవారం రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ అధికారి ఎస్.చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. గత సంవత్సరం వర్షాకాలంలో వరి పంట సుమారు పది వేల ఎకరాల్లో సాగు..
– దమ్మపేట ఏఓ ఎస్.చంద్రశేఖర్రెడ్డి
దమ్మపేట, జూలై 14 : దమ్మపేట మండలంలోని దమ్మపేట రైతు వేదిక నందు వ్యవసాయ శాఖ అధికారులు మంగళవారం రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ అధికారి ఎస్.చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. గత సంవత్సరం వర్షాకాలంలో వరి పంట సుమారు పది వేల ఎకరాల్లో సాగు చేయడం జరిగింది. కానీ ఈ సంవత్సరం ఇప్పటి వరకు కూడా 1,000 ఎకరాల లోపు విస్తీర్ణంలో వరి నాటడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఎల్నినో ప్రభావం వల్ల సాధారణ వర్షపాతం కంటే తక్కువగా నమోదు కావడం చెరువుల్లో, కుంటల్లో నీళ్లు లేకపోవటం, అదేవిధంగా గ్రౌండ్ వాటర్ కూడా తగ్గిపోవడం వల్ల సాగు విస్తీర్ణం ప్రశ్నార్థకంగా మారింది. కావునా రైతులు ఎల్నినో ప్రభావం జూలై, ఆగస్టు నెలలో కూడా ఇదే విధంగా ఉంటుంది, కావునా రైతులు వరికి ప్రత్యామ్నాయంగా తక్కువ నీటితో సాగు అయ్యే అపరాలు అదేవిధంగా చిరుధాన్యపు పంటలు సాగు చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు, అదేవిధంగా వ్యవసాయ అధికారి దమ్మపేట ఏఈఓ అనుబాబు, రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

