టేకులపల్లి: రైతులకు మద్దతుగా రహదారుల దిగ్భంధం కార్యక్రమంలో చిత్రం యూనిట్ పాల్గొన్నది. మరో ప్రేమకథ చిత్రం హీరో, హీరోయిన్ తోపాటు చిత్రబృందం అన్నదాతలకు మద్దతు తెలిపింది. మంగళవారం టేకులపల్లి మండల కేంద్రంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో పోడు రైతు పొలికేక రహదారుల దిగ్భంధం కార్యక్రమం నిర్వహిస్తుండగా.. మరోప్రేమకథ చిత్రంలో హీరోయిన్ శీతలబట్టు, రచయిత జలాల్ రైతులకు మద్దతుగా జరుగుతున్న ధర్నా కార్యక్రమంలో పాల్గొని వారికి న్యాయం జరగాలని కోరారు.
దేశంలో అన్నదాతల అగచాట్లను పాలకులు పట్టించుకోవాలని, రైతులు కష్టపడి పండిస్తేనే మనం అంతా కడుపునిండా తినగలుగుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల పక్ష నాయకులు, రైతులు, రైతు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.