చండ్రుగొండ జులై 28 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కేంద్రంలోని గ్రామ శివారులో పంట పొలాలకు వెళ్లే దారిని గ్రావెల్‌తో నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మంగళవారం పంట పొలాలకు వెళ్లే దారి వద్ద రైతులు బురదలో నిలబడి తమ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ..మునగాల మోహన్ రావు పంట చేను దగ్గరనుంచి వెంకటాపురం వెళ్లే వరకు రోడ్డు సరిగా లేక ఇబ్బంది పడుతున్నామని తెలిపారు.
వెంటనే పంచాయితీ పాలకవర్గం సంబంధిత అధికారులు స్పందించి మొరం ఏర్పాటు చేయాలని లేనిపక్షంలో రైతుల ఆధ్వర్యంలో పంచాయతీ ఆఫీస్ ముందు ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు తంబళ్ల మంగయ్య, జానపాటి నరేష్, దోరేపల్లి లింగరాజు రామ్ శెట్టి, బాలాజీ పాల్గొన్నారు.