చండ్రుగొండ, జూలై 14: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ (Chandrugonda) మండలంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో గత నెల రోజులుగా అన్నదాతలు వానల కోసం ఎదురుచూస్తున్నారు. అప్పుడప్పుడు జల్లులు వస్తుండుతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. గతంలో కంటే ఈ ఏడాది తక్కువ వర్షాభావం వర్షపాతం నెలకొనడంతో చెరువులు, కుంటలు పూర్తిగా ఎండిపోయాయి. వ్యవసాయ బోరు మోటర్ కింద కొంతమేర పచ్చగా పైరులు ఉన్న, వర్షాధార పంటలు మాత్రం ఎండిపోతున్నాయి. మరికొద్ది రోజులు ఇలాగే వర్షపాతం తక్కువగా ఉంటే, వర్షాలు కురవకుండా ఉంటే వరి పంట ప్రశ్నార్థకంగా మారుతుందని రైతులు వాపోతున్నారు. ఏది ఏమైనా వర్షపాతం తక్కువ కావడంపై ఈ ఏడాది కరువు వచ్చే అవకాశాలు ఉన్నాయని రైతులు చర్చించుకుంటున్నారు.