చెరువు ఆక్రమణపై చర్యలు తీసుకోవాలని రైతుల నిరాహార దీక్ష
కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ 48వ డివిజన్లో ఎర్రగుంట గ్రామంలోని చెరువును ఆక్రమణదారుడి నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ గ్రామ రైతులు శుక్రవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. చెరువు వద్ద టెంట్ వేసి రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి..
పాల్వంచ, జూన్ 12 : కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ 48వ డివిజన్లో ఎర్రగుంట గ్రామంలోని చెరువును ఆక్రమణదారుడి నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ గ్రామ రైతులు శుక్రవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. చెరువు వద్ద టెంట్ వేసి రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ నిరాహార దీక్షలు చేపట్టారు. చెరువును ఓ వ్యక్తి ఆక్రమించి శిఖం భూమి సాగు చేస్తూ చెరువులోని నీరంతా వెళ్లగొట్టి పంట పొలాలకు నీళ్లు లేకుండా, అలాగే పశువులు తాగేందుకు నీళ్లు లేకుండా చేయడాన్ని నిరసిస్తూ రైతులు ఈ నిరసన చేపట్టారు. ఆక్రమణదారుడు పట్టా ఉందని చెప్పి, చెరువు మొత్తం తనదేనంటూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి చెరువును కాపాడాలని రైతులు కోరారు. ఆక్రమణదారుల నుండి చెరువును కాపాడేంత వరకు ఈ రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తామని రైతులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం డివిజన్ నాయకుడు దొడ్డ రవికుమార్, రైతులు మండల వెంకన్న, సత్యనారాయణ, మేక ప్రసాద్, నరసింహమూర్తి, తోడేటి సత్యం, రెడ్డిమల్ల వెంకటయ్య, ఆరేపల్లి సత్యనారాయణ, ఆంజనేయులు, శంకర్, బూరా వెంకటేశ్వరావు, మేక శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JNTU | మహబూబాబాద్ జేఎన్టీయూలో అక్రమాలు.. హాస్టల్ డిపాజిట్ పర్సనల్ ఖాతాలోకి!
సాగునీటి వెతలు.. కరెంటు కోతలు.. కరువు కోరలు.. పంట చేతికొచ్చేనా..?
Kodangal | సీఎం ఇలాకాలో బలవంతపు భూ సేకరణ.. మనస్తాపంతో రైతు ఆత్మహత్యాయత్నం
Insurance Scam | శవాల మీది పేలాల మేత.. కార్మిక శాఖలో 150 కోట్ల స్కామ్
Revanth Reddy | చదువును వ్యాపారం చేయొద్దని అప్పుడు ఉపన్యాసాలు.. ఇప్పుడు కూతురితోనే కార్పొరేట్ స్కూల్.. సీఎం రేవంత్ తీరుపై క్రిశాంక్ ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

