పాల్వంచ, ఆగస్టు 30 : జీవకోటి మనుగడకు మొక్కల పెంపకం చేపట్టాలని పాల్వంచ డీఎస్పీ సతీశ్‌కుమార్ అన్నారు. పాల్వంచ డివిజన్ గుడిపాడు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో శనివారం ఆయన మొక్కలు నాటి మాట్లాడారు. ఈ రోజు మనం నాటే మొక్కలే రేపటి భావి తరాలకు స్వచ్ఛమైన ఆక్సిజన్‌తో పాటు జీవ రాశులకు ఫలాలు ఇస్తాయన్నారు. పర్యావరణ సమతుల్యతకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటి, వాటిని పరిరక్షించే బాధ్యత తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి రాష్ట్ర నాయకులు సోయం సత్యనారాయణ, అరేం ప్రశాంత్, తాటి శేషు, కొండ్రు శ్రీరాములు, కోరేం రమేశ్, సోయం హరికృష్ణ, పాఠశాల హెచ్ఎం కొర్స బాబురావు, శ్రీదేవి, సోడే మధు, వంశీ, సందీప్, సంపత్, గ్రామస్తులు పాల్గొన్నారు.