ఇల్లెందు, జూలై 04 : గ్రామాలలో బీఆర్ఎస్ బలోపేతానికి పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ అన్నారు. శనివారం ఇల్లెందు నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ ఇల్లెందు మండల బీఆర్ఎస్ బీఎల్ఏ లతో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఓటరు సవరణ అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. నియోజకవర్గ పరిధిలో ప్రతి మండలం, ప్రతి మండలంలో ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో అన్ని గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ బి ఎల్ ఏ లు, నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కలిసి తమ పరిధిలోనే ఓటరు సవరణ కార్యక్రమంలో పాల్గొని వారికి అవగాహన కల్పిస్తూ ముందుకు సాగాలని సూచించారు. మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని గ్రామాలలో విరివిగా ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్క ఓటరుకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ కుటుంబాల నుండి ఓటరు సవరణలో ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సిలివేరి సత్యనారాయణ, లకావత్ దేవిలాల్, బండారి శ్రీను, ఎట్టి వీరభద్రం, గిన్నారపు రాజేష్, సత్తాల హరికృష్ణ, హరిప్రసాద్ యాదవ్, ఇల్లెందు మండలానికి చెందిన అన్ని గ్రామాల నుండి బీఎల్ఏలు పాల్గొన్నారు.

బీఆర్ఎస్ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్