ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
సింగరేణి సంస్థ ప్రగతిలో ఉద్యోగుల పాత్ర ఎనలేనిదని, సుదీర్ఘ కాలం పాటు క్రమశిక్షణతో విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందుతున్న ఉద్యోగుల సేవలు సంస్థకు చిరస్మరణీయమని కొత్తగూడెం ఏరియా ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు కొనియాడారు. శనివారం..
రుద్రంపూర్, అక్టోబర్ 31 : సింగరేణి సంస్థ ప్రగతిలో ఉద్యోగుల పాత్ర ఎనలేనిదని, సుదీర్ఘ కాలం పాటు క్రమశిక్షణతో విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందుతున్న ఉద్యోగుల సేవలు సంస్థకు చిరస్మరణీయమని కొత్తగూడెం ఏరియా ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు కొనియాడారు. శనివారం స్థానిక జీఎం కార్యాలయంలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు. పర్సనల్ విభాగంలో డిప్యూటీ సూపరింటెండెంట్ (క్లర్క్)గా విధులు నిర్వర్తించిన కె.శ్రీనివాస్ కుమార్, ఫైనాన్స్ విభాగంలో డిప్యూటీ సూపరింటెండెంట్ (క్లర్క్)గా పనిచేసిన రాణి శనివారంతో పదవీ విరమణ పొందారు.
ఈ సందర్భంగా వారిద్దరినీ ఎస్ ఓ టు జీఎం ఎం. గోవిందరావు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. భావి జీవితాన్ని ఆయురారోగ్యాలతో, సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు. ఈ వీడ్కోలు కార్యక్రమంలో డీజీఎం (ఐఈ) ఎన్. యోహన్, పర్సనల్ మేనేజర్ ఎల్. తిరుపతి, డీవైపీఎం జి. హరీష్, సీనియర్ పీఓలు మజ్జి మురళి, బి. రాము, జీఎం ఆఫీస్ పిట్ సెక్రటరీ సిహెచ్. సాగర్, వివిధ విభాగాల అధిపతులు, అధికారులు, జీఎం కార్యాలయ సిబ్బంది పాల్గొని రిటైర్డ్ ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
DK Aruna | భూములు అమ్మి రాష్ట్రాన్ని నడుపుతారా.. సీఎం రేవంత్ రెడ్డిపై డీకే అరుణ ఫైర్!
Jajula Srinivas Goud | బీసీ కులగణనపై అమిత్ షా స్పందించాలి.. దేశవ్యాప్త ఉద్యమం ఆపేది లేదు: జాజుల
Books Launch | తెలుగు సాహితీ వికాస వేదిక ఆధ్వర్యంలో ఘనంగా పుస్తకాల ఆవిష్కరణ
Gold in Rapido | ర్యాపిడోలో బంగారం పంపిస్తే.. ఆభరణాలతో ఉడాయించిన డ్రైవర్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

