బూర్గంపహాడ్, జూలై 17 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని కృష్ణసాగర్ పంచాయతీలో ప్రజలకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు సర్పంచ్ తాటి వాణి, ఉప సర్పంచ్ భూక్యా మోహన్‌రావుతో కలిసి శుక్రవారం ముమ్మరంగా విద్యుత్ మరమ్మతు పనులు చేపట్టారు. గ్రామంలో విద్యుత్ సరఫరా మెరుగుదల కోసం, ప్రజలకు నిరంతరం కరెంటు సరఫరాలో భాగంగా విద్యుత్ సిబ్బందితో మరమ్మతు పనులు చేయించారు. వర్షాకాలం కావడంతో రాత్రి సమయాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ పనులను చేపట్టడం జరిగిందని వారు తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా పంచాయతీ నుండి ప్రజలకు ఏ విషయంలోనూ ఇబ్బందులు తలెత్తకుండా బాధ్యతగా చర్యలు తీసుకుంటున్నట్లు సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.