టేకులపల్లి, డిసెంబర్ 08 : గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను కోరారు. టేకులపల్లి మండలంలోని సంపత్నగర్లో సోమవారం అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలకు ఎన్నికల నియమావళిలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల నిబంధనలు, పోలీసుల సూచనలు పాటిస్తూ ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ప్రచారం చేసుకోవాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసుల నిఘా నిత్యం కొనసాగుతుందని, అందరూ బాధ్యతయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టేకులపల్లి సీఐ బత్తుల సత్యనారాయణ, బోడు ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.