– డీఈ రవికుమార్‌కు కార్పొరేటర్ మునిగడప పద్మ వినతి
రుద్రంపూర్, ఏప్రిల్ 17 : కొత్తగూడెం కార్పొరేషన్ రామవరం నుండి విజయవాడ వైపు వెళ్లే జాతీయ రహదారిపై డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తి మేరకు శుక్రవారం డివిజన్లో ఉన్న సైడ్ డ్రైనేజీలు, కల్వర్టులు, కిన్నెరసాని మంచినీటి సమస్యలను డీఈ రవికుమార్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా నేషనల్ హైవే పక్కన సింగరేణి సివిల్ డిపార్ట్మెంట్ నుండి పాత డ్రైనేజీ మొత్తం పుడుకపోయి, ఆక్రమణలకు గురై చిన్న వర్షం పడితే ఒక చెరువు లాగా జాతీయ రహదారి మారిపోతుందని అధికారులకు వివరించారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఎక్కడ ప్రజలకు సమస్య ఉంటే అక్కడ నిధులు మంజూరు చేయిస్తారని అధికారులకు తెలిపారు. తక్షణమే ఈ రహదారి పక్కన డ్రైనేజీ నిర్మాణాన్ని చేపట్టాలని ఆమె కార్పొరేషన్ అధికారులకు విజ్ఞప్తి చేశారు.
అలాగే మార్కెట్ వెనకాల పది ఇండ్ల నుండి వచ్చిన విజ్ఞప్తుల మేరకు సైడ్ డ్రైనేజీ నీరు బయటికి రాకుండా ఆక్రమణకు గురిచేసి ఒకవైపు మున్సిపల్ రూము, మరొకవైపు ప్రైవేట్ రూము కట్టడంతో డ్రైనేజీ నీరు మునిగిపోయి పురుగులు ఆ గృహాలకు వ్యాప్తిస్తున్నాయలిపారు. తక్షణమే ఈ డ్రైనేజీ నీరు బయటకు వచ్చే మార్గాలను చూడాల్సిందిగా ఆమె అధికారులను కోరారు. సంబంధిత ఇండ్లకు నష్టం జరగకుండా ముందస్తుగా వారికి నోటీసులు అందించి, కాలువ నిర్మాణాన్ని చేపట్టి జాతీయ రహదారిపై నీళ్లు నిలవకుండా చేయాలన్నారు.
దీనిపై స్పందించిన డీఈ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు ఆమె తెలిపారు. అలాగే డివిజన్లో 8 కల్వర్టుల నిర్మాణాన్ని చేపట్టాలని, కిన్నెరసాని మంచినీటి పథకంలో ఏర్పడుతున్న అవాంతరాలను అధిగమించి మంచినీటిని అందించాలని మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సైడ్ డ్రైనేజీని పరిశీలించిన వారిలో నాయకులు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మునిగడప వెంకటేశ్వర్లు, ఏఈ బి.శ్రీకాంత్, వర్క్ ఇన్స్పెక్టర్ కలాం, తదితరులు ఉన్నారు.

‘నేషనల్ హైవే పైకి డ్రైనేజీ నీళ్లు రాకుండా చూడాలి’