బోనకల్లు ఫిబ్రవరి 24 : పశుపోషణపై(Animal nutrition) రైతులు జాగ్రత్తలు పాటించాలని మండల పశువైద్యాధికారి డాక్టర్ అన్వేష్ సూచించారు. బోనకల్లు మండలంలోని రాపల్లి గ్రామంలో పశుగణాభివృద్ధి సంస్థ వైరా ఆధ్వర్యంలో పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మేలు జాతి దూడల ప్రదర్శన, ఉచిత నట్టలనివారణ మందులు పంపిణీ చేశారు. అధిక దిగుబడి నిచ్చే పాల ఉత్పత్తి దారులకు పాలపోటీలు నిర్వహించి వారికి ఉచిత మినరల్ మిక్చర్ కాల్షియం టానిక్స్ అందజేశారు.
ఈ సందర్భంగా పశువైద్యాధికారి అన్వేష మాట్లాడుతూ..రైతులు పశుపోషణపై ప్రత్యేక దృష్టి సారించి పశువుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. పాడి అభివృద్ధికి కావలసినటువంటి సూచనలు సలహాలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైరా పశుగణాభివృద్ధి సంస్థ మోతుకూరి వెంకటేశ్వర్లు సూపర్వైజర్. గ్రామ సెక్రెటరీ యన్.వెంకటరమణి, లైవ్ స్టాక్ అసిస్టెంట్ జి.నాగేంద్ర కుమార్, బి రవికృష్ణ. గ్రామ పశుమిత్ర బంధం త్రివేణి, గోపాల మిత్రులు నాగులు మీరా, వాసు, నాగేశ్వరావు, ప్రవీణ్, సురేష్ పాల్గొన్నారు.