బూర్గంపహాడ్, జూలై 03 : మండల కేంద్రమైన బూర్గంపహాడ్ గౌతంపురం-2 అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం విద్యార్థులకు సర్పంచ్ మందా నాగరాజు స్కూల్ యూనిఫాంను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల్లో చదువుకునే పిల్లలు చదువులో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, టీవీ, సెల్సెన్కు దూరంగా ఉంచి విద్యపై మక్కువ పెంచాలని అప్పుడే పిల్లలు చెడు మార్గాల వైపు వెళ్లకుండా ఉన్నతంగా ఉంటారన్నారు. అంగన్వాడీ సెంటర్లలో పిల్లలకు పోషక విలువలతో కూడిన ఆహారం అందించాలని సూపర్వైజర్కు సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్, ఆయా, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.