Nurse Found Dead | ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రి టాయిలెట్లో.. నర్సు అనుమానాస్పద మృతి
Nurse Found Dead | ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రి టాయిలెట్లో ఒక నర్సు అనుమానాస్పదంగా మరణించింది. టాయిలెట్ డోర్ బ్రేక్ చేసి ఆమె మృతదేహాన్ని బయటకు తెచ్చారు. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
కోల్కతా: ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రి టాయిలెట్లో ఒక నర్సు అనుమానాస్పదంగా మరణించింది. టాయిలెట్ డోర్ బ్రేక్ చేసి ఆమె మృతదేహాన్ని బయటకు తెచ్చారు. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. (Nurse Found Dead) పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఈ సంఘటన జరిగింది. నీల్రతన్ సిర్కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లోని గైనకాలజీ విభాగంలో 30 ఏళ్ల రూపాలి బర్మన్ నర్సుగా పని చేస్తున్నది. బుధవారం రాత్రి 8 గంటలకు నైట్ డ్యూటీకి ఆమె హాజరైంది.
కాగా, ఒక రోగికి వైద్య సేవలు అందించిన తర్వాత రాత్రి 10.20 గంటల సమయంలో హెచ్డీ యూనిట్లోని టాయిలెట్లోకి నర్సు రూపాలి వెళ్లింది. ఆమె ఎంతకూ తిరిగి రాకపోవడంతో సహచరులు పిలిచారు. టాయిలెట్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో వారు ఆందోళన చెందారు. టాయిలెట్ డోర్ బ్రేక్ చేసి లోపలకు వెళ్లి చూశారు. నర్సు రూపాలి నేలపై అపస్మారక స్థితిలో పడి ఉండటంతో వెంటనే ట్రాలీపై చికిత్స కోసం తరలించారు. అయితే డాక్టర్లు పరీక్షించే లోపే ఆమె మరణించినట్లు నిర్ధారించారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి చేరుకున్నారు. నర్సు రూపాలి మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు. ఆత్మహత్యపై ఎలాంటి అనుమానాలు లేవని పోలీస్ అధికారి తెలిపారు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు టాయిలెట్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.
అయితే ఆరోగ్య శాఖ కూడా ఈ సంఘటనపై ప్రత్యేకంగా విచారణ ప్రారంభించింది. దీని కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఏడు రోజుల్లోగా ఆరోగ్య శాఖకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- body
- Dead
- Door Broken
- Hospital
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
Akhilesh Yadav | అఖిలేష్ యాదవ్కు షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ రెబల్ ఎమ్మెల్యేలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

