Dhananjaya de Silva | భారత జట్టులో స్టార్లున్నా.. మాకు ప్రమాదకారి అతడే..!
Dhananjaya de Silva : ఆగస్టు 15న గాలే స్టేడియంలో తొలి మ్యాచ్‌కు సిద్ధమవుతున్న టీమిండియాలో ఒకరి నుంచే తమకు ప్రమాదం పొంచి ఉందని లంక కెప్టెన్ ధనంజయ డిసిల్వా(Dhananjaya de Silva) అన్నాడు.
Dhananjaya de Silva : ఒకప్పుడు సీనియర్ బ్యాటర్లతో టెస్టుల్లో పటిష్టంగా కనిపించిన భారత జట్టుకు శ్రీలంక సిరీస్ పరీక్ష కానుంది. బ్యాటింగ్ యూనిట్ బలంగానే ఉన్నా లంకలో రాణించేది ఎవరు? అనేది సిరీస్ మొదలైతేగానీ చెప్పలేం. ఆగస్టు 15న గాలే స్టేడియంలో తొలి మ్యాచ్‌కు సిద్ధమవుతున్న టీమిండియాలో ఒకరి నుంచే తమకు ప్రమాదం పొంచి ఉందని లంక కెప్టెన్ ధనంజయ డిసిల్వా(Dhananjaya de Silva) అన్నాడు. అలాఅనీ అతడు సారథి శుభ్‌మన్ గిల్, ఓపెనర్ యశస్వీ జైస్వాల్ పేర్లు చెప్పలేదు.
వామప్ మ్యాచ్‌లో గెలుపొందిన భారత్.. రెండు టెస్టుల సిరీస్‌లో విజయంపై కన్నేసింది. ఆగస్టున 15న తొలి మ్యాచ్ కోసం నెట్స్‌లో చెమటోడ్చుతున్నారు టీమిండియా ఆటగాళ్లు. వామప్ మ్యాచ్‌తో టచ్‌లోకి వచ్చిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్, ఓపెనర్ యశస్వీ జైస్వాల్ లంక బౌలర్లను దంచేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే..తమకు వీరి నుంచి కాకుండా కేఎల్ రాహుల్ నుంచి ప్రమాదం ఉందని లంక సారథి ధనంజయ డిసిల్వా (Dhananjaya de Silva) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
🔴WE KEPT INDIA UNDER PRESSURE! – SRILANKA CAPTAIN BIG WARNING 🤯
– SL captain says they won’t depend only on spin against India! 👀
🎙️Dhananjaya de Silva: Spinners will be our primary attack, but we have quality seamers who can change the game.
Our Plan is Take India into the… pic.twitter.com/rs26aXO8mO
— Sam (@cricsam02) August 13, 2026
‘అనుభవం పరంగా చూస్తే కేఎల్ రాహుల్ నుంచి మాకు అతిపెద్ద ప్రమాదం ఉంది. ప్రపంచవ్యాప్తంగా అతడు బాగా రాణించాడు. శ్రీలంకలో కొన్ని మ్యాచ్‌లు కూడా ఆడాడు రాహుల్. గత పర్యటన((2017)లో మా పరిస్థితులకు తగ్గుట్టు ఆడాడు. ఈసారి మాకు అతడే సవాల్ విసరనున్నాడు. భారత్ అనుకుంటున్నట్టు మేము స్పిన్నర్లపై ఎక్కువగా ఆధారపడం. మా ప్రధాన అస్త్రం స్పిన్ అయినప్పటికీ.. మాకు నాణ్యమైన పేస్లు ఉన్నారు. టీమిండియాను ఒత్తిడిలో పడేసి.. మ్యాచ్‌ను నాలుగు, ఐదో రోజు వరకూ తీసుకెళ్తాం.’ అని ధనంజయ తెలిపాడు.
2017లో లంక సిరీస్‌లో రెండు, మూడో టెస్టు ఆడిన కేఎల్ రాహుల్.. రెండు మ్యాచుల్లో అర్ధ శతకాలు సాధించాడు. ప్రపంచటెస్టు ఛాంపియన్షిప్ ర్యాంకింగ్స్‌లో వరసగా 4, 5 స్థానాల్లో ఉన్న.. ఇండియా, లంకకు రెండు టెస్టుల సిరీస్ చాలా కీలకం. దాంతో.. విజయం కోసం ఇరుజట్లు సర్వశక్తులు ఒడ్డనున్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

