సారపాకలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
బూర్గంపహాడ్ మండలం పరిధిలోని సారపాక గ్రామంలో బుధవారం గ్రామ రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యకమం జరిగింది. ఈ కార్యక్రమానికి సారపాక మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గూగులోత్ కిషోర్ శివరాం నాయక్ ముఖ్య అతిథిగా హాజరై...
బూర్గంపహాడ్, నవంబర్ 04 : బూర్గంపహాడ్ మండలం పరిధిలోని సారపాక గ్రామంలో బుధవారం గ్రామ రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యకమం జరిగింది. ఈ కార్యక్రమానికి సారపాక మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గూగులోత్ కిషోర్ శివరాం నాయక్ ముఖ్య అతిథిగా హాజరై అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి పేద కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు అందించాలనే స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా రేషన్ పంపిణీ వ్యవస్థ మరింత పారదర్శకంగా మారుతుందని, లబ్ధిదారులకు సేవలు మరింత సులభతరమవుతాయని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ రెవెన్యూ అధికారులు వెంకన్న, ప్రసాద్, పంచాయతీ ఈవో రవికుమార్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సారపాకలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
Y.S. Sharmila | ఎన్నికల్లో విజయం ప్రజా తీర్పు కాదు..అధికార మదంతో బలవంతపు గెలుపు : వైఎస్ షర్మిల
పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌పై అవగాహన శిబిరం
AP News | ఏపీలో గెలిచిన మేయర్లు, చైర్పర్సన్ల ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే ?
Jairam Ramesh | రాముడి పేరుతో పాపాలు ఇంకెన్నాళ్లు..? బీజేపీపై జైరాం రమేష్ ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

