చుంచుపల్లి, ఆగస్టు 02 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం ములుగుగూడెం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు శనివారం దాత, కొత్తగూడెం బాబు క్యాంపునకు చెందిన సందీప్ బ్యాగులు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎంఈఓ బాలాజీ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరు చేయూతనివ్వాలని కోరారు. దాతలు మరింత మంది ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం రాము, ఉపాధ్యాయులు వెంకటమ్మ, బాలు, గ్రామస్తులు నరేశ్, లక్ష్మణ్, చంటి, వరప్రసాద్, సీఆర్పీ రవీందర్, మధు పాల్గొన్నారు.