ఇల్లెందు, జూన్ 25 : తెలంగాణ ఉద్యమకారుడు, ఇల్లెందు పట్టణానికి చెందిన బొల్లం కనకయ్య అనారోగ్యంతో మంగళవారం కన్నుమూశారు. బుధవారం ఇల్లందులోని వారి నివాసంలో కనకయ్య పార్థీవదేహాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు దిండిగాల రాజేందర్ సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిచిన మంచి వ్యక్తి, తెలంగాణ వీరాభిమాని కనకయ్యను కోల్పోవడం చాలా బాధాకరమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. నివాళులర్పించిన వారిలో టీబీజీకేఎస్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎస్.రంగనాథ్, బీఆర్ఎస్ పట్టణ ఉపాధ్యక్షుడు నబీ, గౌస్ మియా, ఖాజా గౌస్, లలిత్ కుమార్ పాసి, పోషం, రాజశేఖర్, శివ ఉన్నారు.