ఇల్లెందు, జులై 10 : బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు, పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తొలి గ్రంథాలయ చైర్మన్ దిండిగాల రాజేందర్ జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి, ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసి, మొక్కలు నాటారు. అలాగే ఇల్లెందు సుభాష్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పలకలు, బ్యాగులు పంపిణీ చేశారు. జగదాంబ సెంటర్లో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నిర్వహించిన కేక్ కటింగ్ కార్యక్రమానికి ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. దిండిగాల రాజేందర్ ఇలాంటి ఎన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని మనసారా కోరుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు కటకం పద్మావతి, సిలివేరి సత్యనారాయణ, వీరస్వామి, తోట లలిత శారద, సుజాత , ప్రవీణ్ కుమార్, పట్టణ ఉపాధ్యక్షుడు అబ్దుల్ నబీ, టీబీజీకేఎస్ ఇల్లెందు ఏరియా ఉపాధ్యక్షుడు మహమ్మద్ జాఫర్ హుస్సేన్, బీఆర్ఎస్ నాయకులు అజ్మీర బావుసింగ్, దేవీలాల్, ఎలమందల వాసు, వీరస్వామి, సునీల్, ప్రవీణ్, గిన్నారపు రాజేశ్, జబ్బర్, ఘాజి, హరి ప్రసాద్, హరికృష్ణ, చాంద్ పాషా, అఖిల్, శివ, బజార్ సత్యనారాయణ, భూక్య సురేశ్, లలిత్ పాసి, రామ్‌లాల్ పాసి, లక్ష్మీనారాయణ, పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలు ధనలక్ష్మి, సరిత, సమ్మక్క పాల్గొన్నారు.
Yellandu : ఘనంగా ఉద్యమ నేత దిండిగాల రాజేందర్ జన్మదిన వేడుకలు
Yellandu : ఘనంగా ఉద్యమ నేత దిండిగాల రాజేందర్ జన్మదిన వేడుకలు