రామవరం, నవంబర్ 10 : కొత్తగూడెం ఏరియాలో ఈ నెల 14న ఉదయం 10 గంటలకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ క్యాంప్ ను ఆర్.సి.ఓ.ఏ క్లబ్, రుద్రంపూర్, కొత్తగూడెం ఏరియా నందు నిర్వహించడం జరుగుతుందని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ క్యాంపెయిన్ 4.0 లో భాగంగా “డిజిటల్ సాధికారత” పెంచాలనే ఉద్దేశంతో అవగాహన కల్పించేందుకు క్యాంపులను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సింగరేణి సంస్థ కోల్ మైన్ ప్రావిడెంట్ ఫండ్ సంస్థల ఆధ్వర్యంలో డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ క్యాంప్ లను నిర్వహించనున్నట్లు తెలిపారు. సీఎంపీఎఫ్ పెన్షన్ పొందుతున్న సింగరేణి మాజీ ఉద్యోగులు సీపీఆర్ఎంఎస్ కార్డుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.