జూలూరుపాడు, ఆగస్టు 07 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌గా ఏర్పాటు చేయాలని సిపిఐ ఎంఎల్ మాస్‌లైన్ ప్రజాపంథా మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని డాక్టర్ వెంకటేశ్వరరావుకి అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పార్టీ డివిజన్ కార్యదర్శి జాటోతు కృష్ణ మాట్లాడుతూ.. జిల్లాలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే పరిస్థితుల్లో మండలంలోని సబ్ సెంటర్స్, హెల్త్ సెంటర్స్ లో ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వాలన్నారు. పేరుకే 30 పడకల ఆస్పత్రి, సరైన వసతులు, సౌకర్యాలు లేవని మండిపడ్డారు.
కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏర్పాటైతే మూడు మండలాల్లో ఉన్న గ్రామాల ప్రజల ఆరోగ్యాలు మెరుగు పడటానికి సౌకర్యకంగా ఉంటుందని తెలిపారు. పాము, తేలు, రేబిస్, ఎమర్జెన్సీ మందులు అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి బానోతు ధర్మ, జిల్లా నాయకులు ఎదులాపురం గోపాల్ రావు, పార్టీ మండల నాయకులు లింగాల వీరభద్రం, తోటకూరి నరేశ్, బానోతు ధన్వంతరావు, రాయల సిద్దు, బైరు వెంకటేశ్వర్లు, పి,కేశకేశవరావు, బి.సేవియా, వి.శరత్ బాబు, శాంతి స్వరూప, సుజాత పాల్గొన్నారు.