రామవరం, సెప్టెంబర్ 16 : వాస్తవ లాభాలను ప్రకటించి అందులో 35 శాతం వాటాను కార్మికులకు ఇవ్వాలని, స్ట్రక్చర్ మీటింగ్లో ఒప్పుకున్న డిమాండ్లపై వెంటనే సింగరేణి యాజమాన్యం సర్క్యూలర్ జారీచేయాలని ఏఐటీయూసీ సెంట్రల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి గనిగళ్ల వీరస్వామి అన్నారు. మంగళవారం గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సత్తుపల్లి జె వి ఆర్(సమంత) పిట్ కార్యదర్శి ప్రసాద్ అధ్యక్షతన గేట్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజర మాట్లాడారు. ఈ నెల 19న సాయంత్రం 4:00 గంటలకు జీఎం ఆఫీస్ ముందు తలపెట్టిన మహాధర్నాలో సత్తుపల్లి జె వి ఆర్ నుండి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జేవీఆర్ ఓసి జాయింట్ కార్యదర్శి ఆర్.భరణి, జెవిఆర్ ఓసి పిట్ కార్యదర్శి నర్సింహరావు, సీనియర్ నాయకులు బి.సుధాకర్, ఏసుపాదం, విజయ్ పాల్గొన్నారు.