DGP CV Anand | ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో డ్రగ్స్ నియంత్రణ రాష్ట్రానికి అత్యంత కీలకం..!
DGP CV Anand : భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో డ్రగ్స్‌ను నియంత్రించడం రాష్ట్రానికి అత్యంత కీలకమని డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV Anand) అన్నారు.
DGP CV Anand : భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో డ్రగ్స్‌ను నియంత్రించడం రాష్ట్రానికి అత్యంత కీలకమని డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV Anand) అన్నారు. 2029 డిసెంబర్ నాటికి తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు ప్రజల భాగస్వామ్యం అవసరమని వెల్లడించిన డీజీపీ.. కేసుల దర్యాప్తు వేగవంతం చేసి కన్విక్షన్ రేటు పెంచాలని సూచించారు.
సీసీటీఎన్ఎస్ (CCTNS)లో పూర్తి స్థాయిలో డేటా అప్లోడ్ చేసి విచారణను వేగవంతం చేయాలని డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశించారు. డ్రగ్స్ సరఫరా చేసే నెట్‌వర్క్‌పై దేశ దేశవ్యాప్తంగా ఈగిల్ పనిచేస్తుందని పేర్కొన్న ఆయన.. డ్రగ్స్‌తో సంబంధం ఉన్న వారిని అరెస్ట్ చేసేందుకు ఈ మధ్యలో థాయిలాండ్ వెళ్లేందుకు కూడా ఈగిల్ బృందానికి అనుమతి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. గంజాయి, డ్రగ్స్ కట్టడి కోసం బస్ స్టాండ్లు, చెక్‌పోస్టులు, రైల్వే స్టేషన్లలో డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు ముమ్మరం చేయాలని డీజీపీ తెలిపారు.
అలానే సైబర్ నేరాలు, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల పనితీరు అభినందనీయమని పేర్కొన్న డీజీపీ.. నేరాల నియంత్రణలో ఇదే నిబద్ధతతో ముందుకు సాగాలని జిల్లా పోలీసులకు సూచనలు చేశారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss | ఆహారాన్ని ఎక్కువగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చా.. అది సాధ్యపడుతుందా.. ఎలా..?
Greater Noida: రాత్రి నూడుల్స్ తిన్నారు.. కుటుంబంలోని అయిదుగురు మృతి
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నిప్పులు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

