ఉపాధి పనులతో గ్రామాల అభివృద్ధి : జడ్పీ సీఈవో నాగలక్ష్మి
ఉపాధి పనులతో గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని, గ్రామ స్థాయిలో అభివృద్ధి పనులను సమర్ధవంతంగా నిర్వహించడంతో పాటు వీబీ-జీ-రామ్ జీ పథకం అమలులో మేట్లు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని జడ్పీ సీఈవో నాగలక్ష్మి అన్నారు. శుక్రవారం...
– తాళ్లగొమ్మూరు రైతు వేదికలో మేట్లకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం
బూర్గంపహాడ్, అక్టోబర్ 30 : ఉపాధి పనులతో గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని, గ్రామ స్థాయిలో అభివృద్ధి పనులను సమర్ధవంతంగా నిర్వహించడంతో పాటు వీబీ-జీ-రామ్ జీ పథకం అమలులో మేట్లు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని జడ్పీ సీఈవో నాగలక్ష్మి అన్నారు. శుక్రవారం బూర్గంపహాడ్ మండల పరిధిలోని తాళ్లగొమ్మూరు రైతు వేదికలో ఇరవెండి, మోతేపట్టీనగర్, తాళ్లగొమ్మూరు, కోయగూడెం, సారపాక, ముసలిమడుగు, కృష్ణసాగర్ పంచాయతీల మేట్లకు జరిగిన ఒకరోజు శిక్షణా కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. గ్రామాల్లో అందుబాటులో ఉన్న వీబీ జీ రామ్ జీ పథకం నిధులు సద్వినియోగం చేసుకుని అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సూచించారు.
గ్రామ అవసరాలను గుర్తించి ప్రజలకు ఉపయోగపడే పనులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రధానంగా నీటి సంరక్షణకు దోహదపడే పనులు విస్తృతంగా చేపట్టాలన్నారు. ఎంపీడీవో జమలారెడ్డి మాట్లాడుతూ.. ఇంకుడు గుంతల నిర్మాణం, నీటి సంరక్షణ పనులను విస్తృతంగా చేపట్టాలన్నారు. గ్రామాల్లో భూగర్భజలాల పెంపునకు దోహదపడే పనులపై దృష్టిసారించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి రవీంద్రనాథ్ ఠాగూర్, ఎంపీవో రామకృష్ణ, ఈజీఎస్ ఏపీవో విజయలక్ష్మి, ఈసీ వెంకట్, టెక్నికల్, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆయా పంచాయతీల సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఉపాధి పనులతో గ్రామాల అభివృద్ధి : జడ్పీ సీఈవో నాగలక్ష్మి
Vanam-PV Ghanam | ‘వనం-పీవీ ఘనం ’ పుస్తకాన్ని ఆవిష్కరించిన గవర్నర్
NIMS Raids | నిమ్స్ ఆస్పత్రిలో రెండో రోజు కొనసాగుతున్న సోదాలు
Killer | ‘కిల్లర్’ మూవీ రివ్యూ.. రూ.కోటి ఛాలెంజ్ విసిరిన సినిమా ఎలా ఉందంటే!
Fire accident | వైజాగ్ పోర్టు ట్రస్టులో భారీ అగ్నిప్రమాదం.. మంటలు ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

