రుద్రంపూర్, జూన్ 30 : సింగరేణి ఓసీ విభాగంలో పదవీ విరమణ పొందిన డిప్యూటీ జనరల్ మేనేజర్ మధుకర్‌ను ఆయన విశిష్ట సేవలను గుర్తిస్తూ ఎస్&పీసీ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ అభిలాష్ ఆదేశాల మేరకు ఎస్&పీసీ సెక్యూరిటీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు శాలువా కప్పి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ అభిలాష్ మాట్లాడుతూ.. మధుకర్ క్రమశిక్షణ, నిజాయితీ, అంకితభావానికి ప్రతిరూపమని కొనియాడారు. ఉద్యోగానికి పదవీ విరమణ ఉన్నప్పటికీ ఆయన చూపిన విలువలు, సేవాభావానికి పదవీ విరమణ ఉండదన్నారు. ఆయన ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
మధుకర్ మాట్లాడుతూ.. సింగరేణి తనకు ఉద్యోగంతో పాటు గౌరవం, గుర్తింపు, జీవితాన్ని ఇచ్చిందన్నారు. సంస్థ ఆస్తిని ప్రతి ఉద్యోగి తన సొంత ఆస్తిగా భావించి సంరక్షించాలని సూచించారు. విద్యుత్, నీరు వంటి వనరులను వృథా చేయకుండా పొదుపుగా వినియోగించడం ప్రతి ఉద్యోగి బాధ్యత అని తెలిపారు. ప్రతి ఒక్కరూ “ఇది మన సంస్థ” అనే భావనతో పనిచేస్తే సింగరేణి మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో జూనియర్ ఇన్స్పెక్టర్ కామరాజు, ఐఎన్టీయూసీ ఫిట్ కార్యదర్శి మోహన్‌రెడ్డి, ఏఐటీయూసీ ఫిట్ కార్యదర్శి జె. రాంబాబు, షిఫ్ట్ జమేదార్ చంద్రశేఖర్, హానోక్రాజు, జనార్ధన్, సుధాకర్, మల్లికార్జున్, సురేష్, అశోక్, ప్రైవేట్ సెక్యూరిటీ సూపర్వైజర్ ఈశ్వర్, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది, డ్రైవర్లు, వి.కె.-7 ఓసీ మేనేజర్ పాల్గొన్నారు.