‘కుక్కకాటుతో మహిళ మృతి చెందడం అత్యంత బాధాకరం’
కుక్కకాటుతో మహిళ మృతి చెందడం అత్యంత బాధాకరమని, బాధిత నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండ ఎస్సీ కాలనీ..
– బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
– వీధి కుక్కల నివారణకు అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలి
– సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా
లక్ష్మిదేవిపల్లి, మే 26 : కుక్కకాటుతో మహిళ మృతి చెందడం అత్యంత బాధాకరమని, బాధిత నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండ ఎస్సీ కాలనీ, చాటివారిగూడెం గ్రామ పంచాయతీకి చెందిన మారె రాములమ్మ (50) అనే మహిళ కుక్కకాటుతో మృతి చెందగా, మంగళవారం ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో వీధి కుక్కల సంచారం విపరీతంగా పెరిగిపోయిందని, కుక్కకాటు వల్ల ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి వీధి కుక్కల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం తగిన ఆర్థిక సహాయం అందించి అండగా నిలవాలని ఆయన కోరారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మృతురాలి కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించి సంతాపాన్ని తెలిపారు. నివాళులర్పించిన వారిలో జ్యోతిబసు, పిచ్చయ్య, మిరియాల రాము, లక్ష్మయ్య, జాన్సన్, క్రాంతి, రాజేష్, కళ్యాణ్, జ్ఞానముత్యం ఉన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కెమిస్ట్రీ వెంకటేశ్వరరావు మృతి కోదాడ పబ్లిక్ క్లబ్కు తీరని లోటు’
‘బతుకమ్మ పండుగ ఏర్పాట్లలో వివక్షత తగదు’
Gurugram | బర్త్డే నాడే భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న ఐటీ ఉద్యోగి.. చివరగా కంపెనీకి మెయిల్
Boys Kill Friend | బైక్, బర్త్ డే వేడుకకు డబ్బు కోసం.. స్నేహితుడ్ని హత్య చేసిన ఇద్దరు బాలురు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

