రామవరం, ఆగస్ట్ 06 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం పట్టణంలోని టూ ఇంక్లైన్ ఏరియా నివాసి కోలపురి తులసి రామ్ (62) రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి. మంగళవారం ఉదయం చాతి నొప్పితో ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. డాక్టర్ సలహా మేరకు ఖమ్మం తరలిస్తుండగా మార్గం మధ్యలో గుండెపోటుకు గురై చనిపోయారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. దీంతో పెద్ద కుమార్తె బుధవారం తండ్రికి తలకొరివి పెట్టింది.