కొత్తగూడెం అర్బన్, ఏప్రిల్ 10: కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం (CMP) జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. గురువారం కొత్తగూడెం పట్టణంలోని బస్టాండ్ సెంటర్లో సీపీఎం ఆధ్వర్యంలో గ్యాస్ సిలిండర్, కట్టెల పొయ్యితో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తూ పేదల పొట్ట కొట్టే నిర్ణయాలను కేంద్రం తీసుకోవడం బాధాకరమని అన్నారు.
సామాన్యుడు గ్యాస్ సిలిండర్ కొనే పరిస్థితి లేదని, పేదల నడ్డి విరిచే కార్యక్రమాలను కేంద్రం అమలు చేస్తుందని విమర్శించారు. పెంచిన గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలను బేషరతుగా తగ్గించాలని లేని పక్షంలో ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అన్నవరపు కనకయ్య, సీఐటియు రాష్ట్ర కార్యదర్శి బి.మధు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లిక్కీ బాలరాజు, అన్నవారపు సత్యనారాయణ, భూక్యా రమేష్, కొబల్, నాయకులు నందిపటి రమేష్, రాం చరణ్, ముత్తేష్, రఘు, రాములు, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.