రుద్రంపూర్, ఫిబ్రవరి 04 : కొత్తగూడెంలో సీపీఐకు చెందిన పలువురు కార్యకర్తలు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సమక్షంలో బుధవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కొత్తగూడెం 29వ డివిజన్ న్యూగొల్లగూడెంకు చెందిన పలువురు సీపీఐ కార్యకర్తలు ఆ పార్టీని వీడి మల్హోత్రా సాగర్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ లో బుధవారం మధ్యాహ్నం ఎంపీ రవిచంద్ర సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకున్నారు. పార్టీలో చేరిన వారిలో వేముల పవన్-శైలజ, చాగంటి రవి-సుమలత, లాగిశెట్టి ప్రసాద్, గుడిసె శ్రావణ్-మంజు, రోహిత్ (చంటి), భద్ర తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు కన్నయ్య పాల్గొన్నారు.