గుండాల ఫిబ్రవరి 9 : కాంగ్రెస్ పార్టీ(Congress) ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఎన్నికల ముందు అధికారంలోకి రాగానే వందరోజులల్లో అమలు చేస్తామని ప్రకటించింది. కానీ అధికారంలోకి వచ్చి14 మాసాలైనా అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ(CPI ML New Democracy) గుండాల మండల కార్యదర్శి అరెం నరేష్, జిల్లా నాయకులు కొమరం సీతారాములు అన్నారు.
ఈ సందర్భంగా గుండాల మండలంలోని పోతిరెడ్డిగూడెం, చీమల గూడెం, కన్నా యిగూడెం, నరసాపురం తండా తదితర గ్రామాలలో జరిగిన గ్రూప్ మీటింగ్లలో వీరు మాట్లాడుతూ రైతు భరోసా రూ.15000 ఎకరాకు, మహిళలకుమహాలక్ష్మి పథకానికి రూ.2500, వృద్ధాప్య పింఛన్ రూ.4000, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు లాంటి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. ఈ హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
ఈ హామీల అమలు కొరకు సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని, ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరై కాంగ్రెస్ పార్టీకి కళ్లు తెరిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నాయకులు పెండేకట్ల పెంటన్న, వాగబోయిన బుచ్చయ్య, పాయం ఎల్లన్న, కల్తీ ప్రమోద్, బోడ వీరు, బోడ రాము, దుగ్గి శేఖర్, చింత కోటేష్, కిసాన్ సుధాకర్, మోకాళ్ల ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.