రామవరం, జనవరి 01 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీ రామవరం పరిధిలో పర్యావరణ పరిరక్షణలో విశేష సేవలందిస్తున్న రామవరం పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ముస్తఫా, ఆయన మనవడు అఫాన్ జైదీనీ ని గురువారం పంజాబ్ గడ్డ సిపిఐ కార్యాలయంలో పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఇటీవల కృషి విజ్ఞాన కేంద్రం వారు పర్యావరణ పరిరక్షణలో చేసిన సేవలను గుర్తించి ఉత్తమ రైతుగా ముస్తఫాకు పురస్కారం ప్రదానం చేశారు. ప్రకృతి హరిత దీక్షలో భాగంగా ముస్తఫా ఎల్లప్పుడూ మొక్కలు నాటడమే కాకుండా, వివిధ కార్యక్రమాల్లో ప్లాస్టిక్ బొకేలకు బదులు పచ్చని మొక్కలను బహుమతిగా అందిస్తున్నారు. ముస్తఫా మనవడు అఫాన్ జైదీనీ మొక్కలు నాటుతూ, తాను వీపుపై మొక్క మోసుకుంటూ పర్యావరణ పరిరక్షణపై ప్రచారం చేస్తున్నాడు.
వనజీవి రామయ్య, గుమ్మడి నరసయ్య జీవితాలపై తెరకెక్కిన చిత్ర ప్రారంభోత్సవంలో కన్నడ నటుడు శివరాజ్ కుమార్, జిల్లా కలెక్టర్, సింగరేణి సిఎండి బలరాం నాయక్, స్థానిక ఎమ్మెల్యే, ఎస్పీ నుండి ముస్తఫా ప్రశంసలు, అవార్డులు పొందారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు మాతంగి లింగయ్య, జమలయ్య, తూముల శ్రీనివాస్, గోపికృష్ణ, ముంజ శశికాంత్, కొయ్యడ వెంకటేశ్వర్లు, మండల రాజు, బరిగల కమల, బరిగల భూపేష్, మోహన్ స్వామి, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.