రామవరం, ఆగస్టు 19 : సెప్టిక్ ట్యాంక్ పైన ఉన్న మూత పగలడంతో ఆవు దూడ అందులో పడి ఊపిరాడక అవస్థలు పడుతుండడాన్ని చూసిన పలువురు ఆవు దూడను సురక్షితంగా బయటికి తీసిన సంఘటన మంగళవారం చుంచుపల్లి మండలం, రుద్రంపూర్ పంచాయతీ పరిధిలోని తిలక్ నగర్ ప్రాంతంలో జరిగింది. మేత మేస్తూ ఆవు దూడ సెప్టిక్ ట్యాంక్ పైనుండి దాటుతుండగా ట్యాంక్ పైన ఉన్న మూత ఒక్కసారిగా పగలడంతో అందులో ఆపడిపోయింది.
ఇరుకైన ట్యాంక్ కావడంతో ఎటూ కదలలేని స్థిలిలో అరుస్తూ ఉండడంతో గమనించిన మంద నాగేశ్వరరావు వెంటనే విశ్వమాత మదర్ తెరిసా సేవా సంస్థ అధ్యక్షుడు గూడెల్లి యాకయ్యకు సమాచారం అందించారు. ఆయన వెంటనే తన సేవా సభ్యులతో అక్కడికి చేరుకుని ఆవుదూడ శ్రమ కోర్చి కష్టం మీద సురక్షితంగా బయటకు తీశారు. ఈ కార్యక్రమంలో సేవా సభ్యులు ద్రాక్ష శ్రీనివాస్, సిహెచ్ రాము, పెనగడప సుధాకర్, మంద నాగేశ్వరరావు, మంద మోహన్, మంద దేవరాజ్, సత్యరాజ్, కాంట్రాక్ట్ కార్మికుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.