బూర్గంపహాడ్, జూలై 08 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో ఐటీసీ సహకారంతో రూ.1.50 కోట్లతో నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బుధవారం భూమి పూజ చేశారు. సర్పంచ్ బానోత్ సరోజ ఆధ్వర్యంలో ఐటీసీ యూనిట్ హెడ్ శైలేంద్రసింగ్, హెన్ఆర్ హెడ్ శ్యాంకిరణ్తో కలిసి ఆయన పూజ కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం మాట్లాడుతూ.. కమ్యూనిటీ హాల్ నిర్మించుకుంటే గ్రామాల్లో శుభకార్యాలు, ఇతర ఫంక్షన్లు చేసుకోవచ్చని తెలిపారు. ఈ కమ్యూనిటీ హాల్‌ను త్వరితగతిన పూర్తిచేయాలని ఐటీసీ యాజమాన్యానికి సూచించారు. ఈ గ్రామ ప్రజల ఆకాంక్షగా ఉన్న కమ్యూనిటీ హాల్‌ను ప్రభుత్వ హయాంలో నిర్మించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీలు కామిరెడ్డి శ్రీలత, బట్టా విజయ్ంధీ, టీఎన్టీయూసీ గుర్తింపు సంఘం అధ్యక్షుడు కనకమేడల హరిప్రసాద్, పాలకవర్గ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.