పాల్వంచ, మే 28 : ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం కలిగించాలనే సదుద్దేశంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్(Collector Jitesh V Patil) తన సతీమణిని పాల్వంచ వైద్య విధాన పరిషత్ హాస్పిటల్లో చేర్పించారు. కాగా, బుధవారం పండంటి మగ బిడ్డకు శ్రద్ధ జీతేష్ వి పాటిల్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. గర్భవతి అయినప్పటి నుంచి ఆమెను పాల్వంచ ప్రభుత్వ హాస్పిటల్కు జిల్లా కలెక్టర్ ప్రతినెలా కూడా తీసుకుని వచ్చి దగ్గరుండి మరి అన్ని పరీక్షలు చేయిస్తూ ఆరోగ్య జాగ్రత్తలు తీసుకున్నారు.
ఈ క్రమంలో కలెక్టర్ సతీమణికి నెలల నిండడంతో బుధవారం హాస్పిటల్కు తీసుకువచ్చారు. జిల్లా వైద్య సమన్వయ అధికారి రవిబాబు పాల్వంచ ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాంప్రసాద్, సర్జన్ సోమరాజు దొర, డాక్టర్ ప్రసాద్ సమక్షంలో నర్సింగ్ ఆఫీసర్ స్వర్ణలత గైనకాలజిస్టులు సరళ, అనూష సిజేరియన్ ఆపరేషన్ చేశారు. తల్లీ, బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉన్నారని వైద్య సిబ్బంది తెలిపారు.