కొత్తగూడెం అర్బన్, ఆగస్టు 29: చదువుతో పాటు క్రీడలు కూడా విద్యార్థులకు ఎంతో అవసరమని, క్రీడలను కెరీర్‌గా ఎంచుకొని దేశానికి పేరు తెచ్చిన క్రీడాకారులు ఎంతో మంది ఉన్నారని జిల్లా కలెక్టర్ జీతేశ్ వి పాటిల్ అన్నారు. హాకీ మాంత్రికుడు, మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి శుక్రవారం పట్టణంలోని సింగరేణి స్టేడియంలో కలెక్టర్ విజేతలకు బహుమతులను అందజేసి మాట్లాడారు. ప్రతి రోజు క్రీడల్లో సాధన చేస్తే ఏదో ఒక రోజు అద్భుతమైన విజయాలను సొంతం చేసుకోవచ్చని, సాధన చేయడం ద్వారానే ఇది సాధ్యమవుతుందన్నారు.
తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ప్రోత్సహించాలని సూచించారు. క్రీడలను విజయవంతంగా నిర్వహించిన కోచ్ లను కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో యువజన సర్వీసులు, క్రీడల జిల్లా అధికారి పరంధామ రెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ యుగంధర్ రెడ్డి, జిల్లా స్పోర్ట్స్ సెక్రటరీ నరేష్, జిల్లా బాక్సింగ్ ప్రెసిడెంట్ ఎర్ర కామేష్, టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షులు వై వెంకటేశ్వర్లు, బాడ్మింటన్ సెక్రెటరీ సావిత్రి , వివిధ క్రీడాల కోచ్ లు తదితరులు పాల్గొన్నారు.