– బీఎల్వోలకు ఆర్డీఓ మధు సూచన
చుంచుపల్లి, జూలై 07 : చుంచుపల్లి మండలం విద్యానగర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం కొత్తగూడెం ఆర్డీఓ, ఈఆర్వో మధు ఆధ్వర్యంలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) ఓటర్ల నుండి ఎన్యూమరేషన్ ఫారాలు (ఈఎఫ్లు) సకాలంలో సేకరించి, వాటి డిజిటైజేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆర్డీఓ సూచించారు. ప్రతి ఓటరుని చేరుకుని ఫారాల సేకరణను వేగవంతం చేయడంతో పాటు ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చుంచుపల్లి తాసీల్దార్ నాగరాజు, విద్యానగర్ గ్రామ సర్పంచ్ లక్ష్మి, ఉప సర్పంచ్ వాసిరెడ్డి మురళి, వార్డు సభ్యులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

‘ఈఎఫ్ల సేకరణ, ఫారాల డిజిటైజేషన్ వేగవంతం చేయాలి’