రామవరం, డిసెంబర్ 17 : అతివేగంగా ఓవర్టేక్ చేస్తున్న క్రమంలో బొగ్గు టిప్పర్ అదుపుతప్పి హై టెన్షన్ టవర్‌ను ఢీకొన్న సంఘటన బుధవారం కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని ఎస్సీబీ నగర్లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోయగూడెం ఓపెన్ కాస్ట్ నుండి రుద్రంపూర్ కోల్డ్ హ్యాండ్లింగ్ ప్లాంట్‌కు బొగ్గు తీసుకుని వస్తున్న టిప్పర్ ఎస్సీబీ నగర్ సోలార్ ఫ్లవర్ ప్లాంట్ జాతీయ రహదారిపై డీసీఎంను ఓవర్టేక్ చేయాలని అతివేగంతో వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా డీసీఎం లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో డీసీఎం రోడ్డుపై నుండి డివైడర్ పైకి ఎక్కింది. బొగ్గు టిప్పరు అదుపుతప్పి రోడ్డు ప్రక్కన ఉన్న హై టెన్షన్ టవర్‌ను ఢీకొట్టింది. దీంతో బొగ్గు టిప్పర్‌లో ఉన్న క్లీనర్ క్యాబిన్లో ఇరుక్కుపోవడంతో సింగరేణి రెస్క్యూ టీమ్ అక్కడ చేరుకుని క్యాబిన్లో ఇరుక్కుపోయిన క్లీనర్‌ను అధునాతన పరికరాలను ఉపయోగించి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Ramavaram : ఎస్సీబీ నగర్లో బొగ్గు టిప్పర్ బీభత్సం