– సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా
– పలు సమస్యలపై కొత్తగూడెం ఏరియా జీఎం కార్యాలయం ముందు ఏఐటీయూసీ ఆందోళన
రుద్రంపూర్, మార్చి 24 : వికేసిఎం ఓసిలో సింగరేణి యంత్రాలతో, సింగరేణి కార్మికులతో మాత్రమే బొగ్గు తవ్వకాలు చేపట్టాలని, అలాగే వీకే సి హెచ్ పి క్రషర్లను సింగరేణి కార్మికులతోనే నడపాలని సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా డిమాండ్ చేశారు. సింగరేణిలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఒక్కరోజు నిరాహార దీక్షను కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కొత్తగూడెం ఏరియా బ్రాంచ్ సెక్రటరీ వట్టికొండ మల్లికార్జున్ రావు నాయకత్వంలో చేపట్టారు. నిరాహార దీక్ష శిబిరంలో పాల్గొన్న షాబీర్ పాషా ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్తగూడెం పీవీకే5 ఇంక్లైన్ నుండి సత్తుపల్లి ప్రాంతంలో దీర్ఘకాలంగా డిప్యూటేషన్‌పై పని చేస్తున్న జనరల్ అసిస్టెంట్లను సర్ఫేస్ జనరల్ అసిస్టెంట్లుగా కన్వర్షన్ చేసి కొత్తగూడెం ఏరియాలో పోస్టింగ్ ఇవ్వాలని కోరారు. జీకే ఓ సి నుండి సత్తుపల్లికి వెళ్లిన సింగరేణి ఉద్యోగులందరిని తిరిగి వి కే సి ఎం ఓసి కు తీసుకురావాలని, అలాగే కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈ నిరాహార దీక్షలో కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్, ఏరియా బ్రాంచ్ కార్యదర్శి మల్లికార్జున్ రావు, కార్పొరేట్ బ్రాంచ్ కార్యదర్శి రమణమూర్తి, సుధాకర్, గనిగళ్ల వీరస్వామి, సహాయ కార్యదర్శులు గట్టయ్య, రాము, వైస్ ప్రెసిడెంట్ కత్తెర్ల రాములు, ఆఫీస్ బేరర్లు సందబోయిన శ్రీనివాస్, ఎస్ నాగేశ్వరరావు, బండారి మల్లయ్య, రాజేశ్వరరావు, కర్రు రమేష్, పిట్ కార్యదర్శులు మధుకృష్ణ, కమల్, భుక్య రమేష్, ఎం ఆర్ కే ప్రసాద్, కిషోర్, అలాగే సిపిఐ పార్టీ నాయకులు కంచర్ల జములయ్య, భూక్యా శ్రీనివాస్, ఎస్ కె ఫయ్యుం, భూపేష్ పాల్గొన్నారు.

‘సింగరేణి యంత్రాలు, కార్మికులతో మాత్రమే బొగ్గు తవ్వకం చేపట్టాలి’