CITU | పెంచిన గ్యాస్, పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి
CITU | పెంచిన గ్యాస్, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ఇల్లెందు పట్టణం కూరగాయల మార్కెట్ వద్ద సీఐటీయూ నాయకుల ఆధ్వర్యంలో ఖాళీ సిలిండర్లతో నిరసన తెలిపారు.
ఇల్లందు, ఏప్రిల్ 10 : పెంచిన గ్యాస్, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ఇల్లెందు పట్టణం కూరగాయల మార్కెట్ వద్ద సీఐటీయూ నాయకుల ఆధ్వర్యంలో ఖాళీ సిలిండర్లతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ కన్వీనర్ తాళ్లూరి కృష్ణ అధ్యక్షతన జరిగిన సభలో జిల్లా సహాయ కార్యదర్శి అబ్దుల్ నబి పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్నదని అన్నారు. ప్రపంచ దేశాలలో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గితే మన దగ్గర గ్యాస్ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం ఏమిటని ప్రశ్నించారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉందని విమర్శించారు. ఒకవైపు ప్రభుత్వం నిత్యావసర వస్తువులపై విపరీతంగా ధరలు పెంచుతున్న పాలకులు పట్టించుకోవడం లేదని, మరో వైపు ప్రత్యక్ష, పరోక్ష పన్నులులు అసాధారణంగా పెంచుకుంటూ పోతున్నాయని, ఈ విధానాలకు వ్యతిరేకంగంగా ప్రజలు పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కామ నాగరాజు, సత్యనారాయణ కోరి, పవన్ పాసి, వెంకన్న, కోటేశ్వరరావు, గోల్కొండ బాలకృష్ణ, కాంత, ప్రసాద్ రాజు, హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

