భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 31 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడిగా చాపల మడుగు రామ్మూర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల కేంద్రంలో ఆదివారం జరిగిన ఆ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో నాయకులు కార్యకర్తలు కలిసి ఏకగ్రీవంగా రామ్మూర్తిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై ఉంచిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని, ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక కార్యకలాపాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను చైతన్య పరుస్తానన్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా ప్రజలను భాగస్వామ్యం చేసి ప్రజా ఉద్యమాలను నిర్మించే ప్రజల పక్షాన పోరాటాలు చేపడుతామని పేర్కొన్నారు. త్వరలో రాబోయే లోకల్ ఎలక్షన్లలో బీఆర్ఎస్ను ముందు వరుసలో ఉంచుతానని, పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు. పార్టీ శ్రేణులు అంతా సహకరించి తనపై పెట్టిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించేందుకు సహకరించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, చాపల మడుగు రామ్మూర్తి కీ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు యల్లంకి సత్యనారాయణ, వైరా నియోజకవర్గ నాయకులు గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.