భద్రాచలం: భద్రాద్రి రామయ్యను శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఎన్ హరినాథ్ కుటుంబ సమేతంగా దర్శించుకోగా, ఏపీలోని రంపచోడవరం ఎమ్మెల్సీ అనంతబాబు, ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి లు స్వామివారి సేవ చేసుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ముందుగా బలిపీఠం వద్ద నమస్కరించుకొని, అంతరాలయంలోని మూలమూర్తుల వద్ద ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న భద్రుని కోవెలను,లక్ష్మి తాయారమ్మవారిని,ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్నారు. తాయారమ్మ వారి సన్నిధిలో అర్చకులు వారికి వేదాశీర్వచనం అందజేసి,స్వామివారి తీర్థప్రసాదాలను,శేషవస్త్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఓ బానోత్ శివాజీ పాల్గొన్నారు.