– బంధువు పరామర్శకు వచ్చి బంగారు గొలుసు కోల్పోయిన వైనం
కొత్తగూడెం సింగరేణి, సెప్టెంబర్ 16 : అనారోగ్యంతో సింగరేణి ప్రధాన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బంధువులను చూసేందుకు మంగళవారం ఉదయం కొత్తగూడెం పట్టణం సన్యాసి బస్తీకి చెందిన భీమవరపు స్రవంతి తన భర్తతో కలిసి వచ్చింది. బంధువులను పరామర్శించి బయటకు వచ్చిన క్రమంలో తన మెడలోని బంగారు గొలుసు (తులం) లేకపోవడంతో ఆందోళన చెందింది. వెంటనే గొలుసు పోగొట్టుకున్నానని తెలుసుకుని, ఆస్పత్రి క్యాజువాలిటీ ఆవరణలో తన భర్తతో కలిసి మొత్తం వెతికింది. మొత్తం వెతికినప్పటికీ గొలుసు మాత్రం కనపడలేదు. దీంతో వెంటనే ఒకటవ టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది.
అనంతరం మళ్లీ సింగరేణి ఆస్పత్రికి వచ్చి ఆస్పత్రిలోని వైద్యులకు విషయం చెప్పి సీసీ ఫుటేజ్ పరిశీలించాలని వేడుకోగా వైద్యులు మాత్రం తాపీగా సీసీ కెమెరాలు పని చేయడం లేదని జవాబు చెప్పారు. ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కెమెరాలు పని చేయకపోవడంపై బాధితురాలు అసహనం వ్యక్తం చేసింది. సీసీ కెమెరాలు పనిచేస్తే గొలుసు ఎక్కడ పోయిందో తెలుసుకునే అవకాశం ఉండేదని బాధితురాలు స్రవంతి తన ఆవేదనను వెలిబుచ్చింది.
Kothagudem Singareni : సింగరేణి ప్రధాన ఆస్పత్రిలో పని చేయని సీసీ టీవీ కెమెరాలు