బూర్గంపహాడ్, ఏప్రిల్ 16 : నాటుసారా విక్రయిస్తున్న నలుగురిపై కేసులు నమోదు చేసి 16 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నట్లు భద్రాచలం ఎక్సైజ్ సీఐ రహీమున్నీసాబేగం గురువారం తెలిపారు. జిల్లా ఆబ్కారీ అధికారి జానయ్య ఆదేశాల మేరకు జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కరంచంద్ పర్యవేక్షణలో సీఐ రహీమున్నీసాబేగం ఆధ్వర్యంలో మండల పరిధిలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నాటుసారా విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులపై కేసులు నమోదు చేసి వారి వద్ద నుంచి 16 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం నాటుసారా, మత్తు పదార్ధాలకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎక్సైజ్ ఎస్ఐలు అల్లూరి సీతారామరాజు, గౌతమ్, సిబ్బంది పాల్గొన్నారు.