భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 22 : పాలిటెక్నిక్ విద్యపై కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న కుట్రకు నిరసనగా బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ధర్నాలకు పూనుకుంది. పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసేందుకు కొత్తగా జీవో నెంబర్ 97 ను అమల్లోకి తీసుకువచ్చి వారికి ఉన్నత విద్య అవకాశాలు లేకుండా చేయడం దారుణం అన్నారు. ఆ జీవోను వెంటనే రద్దు చేయాలన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపు మేరకు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ధర్నాలు చేశారు. పాల్వంచలో బీఆర్ఎస్వీ, యువజన విభాగం అఖిల్ మహర్షి, హసీబ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ లో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకురాలు కార్పొరేటర్ సింధు తపస్వి, గణేష్, నరసింహ, అంజద్, రవి, జానకి రామ్, ప్రశాంత్, శశాంక్, హరి, క్రాంతి కుమార్, సాయి, నాగు, బన్ను పాల్గొన్నారు.