ఇల్లందు, ఏప్రిల్ 23 : ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం పార్టీ మండలాధ్యక్షుడు బొమ్మర్ల వరప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై ప్రచార గోడ పత్రికలను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..
కేసీఆర్ పది సంవత్సరాల పాలనా కాలంలో తెలంగాణ ప్రజలకు అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలను ఆదుకున్నట్లు, అటువంటి కేసీఆర్కు ప్రజలంతా మద్దతుగా నిలిచి రజతోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బోడ బాలు, బానోతు రామ, నాయకులు భూక్య లాలూనాయక్, బానోతు మోహన్, నాగేందర్ పాల్గొన్నారు.