ఇల్లెందు జులై 19 : కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారు. వానకాలం ప్రారంభమై సాగు పనులు ప్రారంభమైనా ఎరువులు, పురుగులు మందులు లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా రైతులకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఇల్లెందు నియోజకవర్గ ఇన్చార్జి హరిప్రియ నాయక్ ఆధ్వర్యంలో ఎరువుల గోడౌన్ ముందు నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా హరిప్రియ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో గడిచిన పది సంవత్సరాలలో ఏనాడూ లేని ఎరువుల కొరత కాంగ్రెస్ పార్టీ వచ్చాక మొదలైందన్నారు. సమస్యను ముందుగా గుర్తించని కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనం వల్ల రైతులు బాధపడుతున్నారని చెప్పారు. పాలనలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వ్యవసాయ మంత్రి, రెవెన్యూ మంత్రి, ఆర్థిక మంత్రి ఉండి కూడా రైతులకు సరిపడిన ఎరువులు సరఫరా చేయలేకపోవడంలో వారి అసమర్ధత కనిపిస్తుందని విమర్శించారు. అనంతరం రైతులకు సక్రమంగా ఎరువులు అందించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, ఇల్లెందు ఏడిఏ లాల్ చందు, మండల వ్యవసాయ శాఖ అధికారి సతీష్ లకు వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో దిండిగల రాజేందర్, బీఆర్ఎస్ ఇల్లందు మండల అధ్యక్షుడు శీలం రమేష్, టేకులపల్లి మండల అధ్యక్షుడు బొమ్మెర్ల వరప్రసాద్ గౌడ్, బయ్యారం మండల అధ్యక్షుడు తాత గణేష్, కామేపల్లి మండల అధ్యక్షుడు అంతోటి అచ్చయ్య, బోడ బాలు, సిలివేరి సత్యనారాయణ, దేవిలాల్, దాస్యం ప్రమోద్, వీరస్వామి, ఖమ్మంపాటి రేణుక, ఆమెడ రేణుక, నెమలి ధనలక్ష్మి, కొక్కు సరిత, డేరంగుల పోశం, బండారి శీను, గిన్నారపు రాజేష్, కాసాని హరిప్రసాద్, చాంద్‌పాషా, రవికాంత్, ఘాజి, అబ్దుల్లా, మాజీ సర్పంచ్ మౌనిక , భాగ్యలక్ష్మి, మౌనిక , మునిగంటి శివ, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.