పాల్వంచ, సెప్టెంబర్ 16 : యూరియా బస్తాల కోసం పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ కార్యాలయం వద్ద ఉదయం నుండి క్యూ లైన్లలో వేచి ఉన్న 250 మంది రైతులకు బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుడు, పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షుడు కాంపెల్లి కనకేశ్ పటేల్ ఆధ్వర్యంలో మంగళవారం భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. రైతులకు పాల్వంచ పట్టణంలోని ఒడ్డుగూడెం ప్రాంతంలో గల దివ్యశ్రీ ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ యజమాని తోట సతీష్ ఉచితంగా మినరల్ వాటర్ ను సరఫరా చేశారు. ఈ సందర్భంగా కాంపల్లి కనకేశ్ మాట్లాడుతూ.. పాల్వంచ మండలంలోని దూర ప్రాంతాల రైతులు యూరియా కోసం ఉదయాన్నే వచ్చి క్యూ లైన్ లో సాయంత్రం వరకు వేచి ఉంటున్నారని, అందుకే వారికి మధ్యాహ్నం భోజన సదుపాయం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో పాల్వంచ సొసైటీ ఆఫీస్ వద్ద యూరియా అందించే ప్రతిరోజు ఇలాగే భోజన సదుపాయం ఏర్పాటు చేస్తానని చెప్పారు.
భోజనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బిఆర్ఎస్ పార్టీ పాల్వంచ పట్టణ అధ్యక్షుడు మంతపురి రాజు గౌడ్ మాట్లాడుతూ.. గత 45 రోజులుగా యూరియా కోసం రైతులు సొసైటీ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారని, రైతులకు సరిపడా యూరియా అందించడం ఈ ప్రభుత్వానికి చేత కావడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సంగ్లోత్ రంజిత్, మారుమూళ్ల కిరణ్, కొత్తచెరువు హర్షవర్ధన్, పూజాల ప్రసాద్, ఆలకుంట శోభన్, గంగాధరి పుల్లయ్య, వల్లపిన్ని వెంకటేశ్వర్లు, పోసారపు అరుణ్, కుమ్మరికుంట్ల వినోద్, గజ్జెల రితిక్, కొండే మనోజ్, కూరెళ్లి మురళి మోహన్, ఆలి, సిహెచ్ ప్రవీణ్ , కొమ్మాలపాటి నిఖిల్, గడ్డం శ్రీకాంత్, తోట సతీష్ పాల్గొన్నారు.
Palvancha : రైతులకు బీఆర్ఎస్ నాయకుడి భోజన సదుపాయం