కొత్తగూడెం అర్బన్, జులై 24: బీఆర్ఎస్ పార్టీ రాష్ర్ట వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటిఆర్ జన్మదిన వేడుకలను పట్టణంలో ఘనంగా నిర్వహించారు. బూడిదగడ్డలోని స్నేహలత – సంధ్యలత అనాథ శరణాలయంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ వేల్పుల దామోదర్ కేక్ కట్ చేశారు. అనంతరం శరణాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి మాజీ మంత్రి కేటీఆర్ ఎనలేని కృషి చేశారని అన్నారు. ఐటీ రంగంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన నాయకుడు కేటీఆర్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు అంబుల వేణు, వేముల ప్రసాద్ బాబు, పిల్లి కుమార్, హైమద్, బొండుగుల శ్రీధర్, లక్ష్మీదేవి పల్లి పార్టీ మండల అధ్యక్షుడు కొట్టి వెంకటేశ్వర్లు, నయీం, ఉమర్, జావిద్, ఘని,భిక్షపతి, నాగరాజు, నరేష్, తదితరులు పాల్గొన్నారు.